News October 12, 2025
నల్గొండ: 106 మంది నుంచి రూ.46 కోట్లు?

అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీపై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 12 మంది భాధితుల ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. అతని సెల్‌ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా 106 మంది నుంచి రూ.46 కోట్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేలింది.
Similar News
News October 12, 2025
లోకేశ్ గారు మీరైనా మా’ఘోష’ వినరా..!

ఉక్కు యాజమాన్యం ఉద్యోగుల పిల్లల కోసం 1984లో తమ సొంత ఆర్ధిక వనరులతో విశాఖ విమల విద్యాలయం పాఠశాలను ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఉక్కు ఉద్యోగుల పిల్లలు లేరనే దురుద్దేశ్యంతో అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి వారిని రోడ్డున పడేశారు. దీంతో సిబ్బంది జూన్ 12 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఉక్కు యాజమాన్యంతో మంత్రి లోకేశ్ మాట్లాడి పాఠశాల పునఃప్రారంభించాలని సిబ్బంది వేడుకుంటున్నారు.
News October 12, 2025
విశాఖకు రైడెన్.. ₹22 వేల కోట్ల రాయితీలు!

AP: గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech వైజాగ్‌లో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైడెన్‌కు భారీ సబ్సిడీలు ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. భూమి విలువపై 25% డిస్కౌంట్‌తో 480 ఎకరాలు, జీఎస్టీపై సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, నీరు, విద్యుత్ వాడకంపై రాయితీతో సహా మొత్తంగా ₹22 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
News October 12, 2025
గజ్వేల్: 7 నెలల గర్భంతోనే పెళ్లి చేసుకుంది..!

గజ్వేల్ పరిధి ములుగు మండలంలో <<17983898>>ఇద్దరిపై పోక్సో కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే. SI విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. సదరు యువతిని ఏడాదిగా ఉదయ్ కిరణ్ అనే యువకుడు లవ్ చేస్తున్నాడు. అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. ఇదే అదనుగా భావించిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో గర్భం దాల్చింది. 7 నెలల గర్భంతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న 13 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.