News March 10, 2025
నల్గొండ: 11, 12 తేదీల్లో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్

ఈనెల 11, 12 తేదీలలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యుల బృందం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 11న నల్గొండ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సా.5.30వరకు సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 10, 2025
నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్‌కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.
News March 10, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

శాసనమండలి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖారారైంది. హైదరాబాద్ మఖ్దూం భవన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. నెల్లికంటి సత్యం సోమవారం ఉదయం 10గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లికంటి సత్యం NLG జిల్లా సీపీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
News March 10, 2025
నల్గొండ: స్వల్ప మెజారిటీతో అద్దంకి ఓటమి..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. దయాకర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారని ఈయనకు పేరు.