News May 15, 2024
నల్గొండ: 2007 నుంచి కారు పార్టీదే గెలుపు

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.
Similar News
News February 22, 2026
NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
News February 22, 2026
NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.
News February 22, 2026
NLG: ఈనెల 27 వరకు పెన్షన్ల పంపిణీ: డీఆర్డీవో

ఆసరా పింఛన్లను 27వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసులలో అందజేయనున్నట్లు తెలిపారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని, దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.


