News December 25, 2025
నల్గొండ: 31న అర్ధరాత్రి వరకు వైన్స్

న్యూ ఇయర్ నేపథ్యంలో DEC 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వైన్స్ రాత్రి 12 గంటల వరకు, బార్లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు వెసులుబాటు కల్పించడంతో యజమానులు భారీ ఏర్పాట్లు చేశారు. లైటింగ్స్తో దుకాణాలను ముస్తాబు చేయడంతో పాటు, గిరాకీకి తగ్గట్టుగా అన్ని బ్రాండ్లను సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయి విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.
Similar News
News January 10, 2026
నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
News January 10, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి వరకు ఛాన్స్

సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2025 సంవత్సరానికి గాని పథకం అమలు కోసం ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసింది.
News January 10, 2026
క్రీడలతో పోలీసులకు ఒత్తిడి దూరం: నల్గొండ కలెక్టర్

నల్గొండ సమీపంలోని అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో 5 రోజుల పాటు నిర్వహించిన ‘ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్-2025’ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి.చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించడమే కాకుండా, పోలీసుల విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి నవోత్తేజాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు.


