News February 27, 2025
నల్గొండ: 55.48 శాతం పోలింగ్ నమోదు

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్‌లో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 గంటల వరకు 2,598 మంది ఉపాధ్యాయులు ఓట్లు వేయగా 55.48% పోలింగ్ నమోదైంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా ఎన్నికల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Similar News
News February 27, 2025
నల్గొండ: కల్లు గీస్తుండగా పాముకాటుతో మృతి

నార్కట్ పల్లి మండలం తొండల్ వాయికి చెందిన గీత కార్మికుడు దంతూరి శంకర్ బుధవారం సాయంత్రం పాముకాటుతో మరణించారు. గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసిందని, కిందికి దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం చెప్పి కిందపడిపోయాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 27, 2025
నల్గొండ: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని నార్కట్ పల్లి, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
News February 27, 2025
వరంగల్‌లో నల్గొండ విద్యార్థిని సూసైడ్

నల్గొండ రాక్ హిల్స్ కాలనీకి చెందిన విద్యార్థిని రేష్మిత వరంగల్‌లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ కాలేజీలో రేష్మిత ఫస్టియర్ చదువుతోంది. ముభావంగా ఉండడంతో ఇటీవలే ఇంటికి తీసుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపించారు. బుధవారం శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెళ్లగా బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.