News February 28, 2026

నల్గొండ: 9,750 కుటుంబాలకు రంజాన్ తోఫా..!

image

రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండడంతో రంజాన్ తోఫా జిల్లాలకు చేరవేసింది. దీంట్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 9,750 కుటుంబాలను గుర్తించారు. ఆయా కుటుంబాలకు రంజాన్ తోఫాతో పాటుగా ప్రభుత్వం నూతన దుస్తులు అందించనుంది.

Similar News

News February 28, 2026

భారత్ సెమీస్‌కు వెళ్లదు, పాక్ వెళ్తుంది: అమీర్

image

పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ <<19191335>>మరోసారి<<>> టీమ్ ఇండియాపై విషం కక్కారు. ‘గతంలో నేను చెప్పిన మాటమీదే నిలబడి ఉన్నా. భారత్ సెమీఫైనల్‌కు వెళ్లదు. వెస్టిండీస్‌పై ఓడిపోతుంది. పాకిస్థాన్ శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. మేం సెమీస్‌లో గెలిస్తే కొలంబోలో ఫైనల్ కూడా ఆడతాం’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరి పాకిస్థాన్ సెమీస్ వెళ్తుందా? కామెంట్ చేయండి.

News February 28, 2026

జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

image

జడ్చర్ల మండలం మల్లేబోయిన్‌పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి పెద్ద మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని మిగిల్చింది. చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.

News February 28, 2026

KK లైన్ కోల్పోయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్

image

APకి కీలకమైన కొత్తవలస-కిరండోల్ (KK లైన్) మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి రాయగడ డివిజన్‌లోకి వెళ్లింది. వాల్తేరు డివిజన్‌లో KK లైన్లోని అరకు, బొర్ర గుహాలు, ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం వచ్చేది. కొత్తవలస జంక్షన్‌తో పాటు VZM, SKLM జిల్లాల్లోని కీలక సెక్షన్లు రాయగడ డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వెళ్లాయి. ఈ జోన్ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది.