News December 20, 2025
నల్గొండ: GOVT జాబ్ కొట్టిన అమ్మాయి

గ్రూప్-3 ఫలితాల్లో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన యువతి సత్తా చాటారు. గ్రామానికి చెందిన నివేదిత గ్రూప్-3 పరీక్షలో విజయం సాధించి ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందారు. తన తల్లిదండ్రులు బిక్షం రెడ్డి, సరిత సహకారం, నిరంతర కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని నివేదిత తెలిపారు.
Similar News
News December 26, 2025
కామారెడ్డి: రైలు కిందపడి మేస్త్రి సూసైడ్

కామారెడ్డిలోని రైల్వే స్టేషన్ సమీపంలో <<18676085>>రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య<<>> చేసుకున్నాడు. రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన తమ్మిశెట్టి కన్నయ్య(63) దేవగిరి ఎక్స్‌ప్రెస్ కిందపడి చనిపోయాడు. మృతుడు 30 ఏళ్లుగా కామారెడ్డిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 26, 2025
TCIL 25 పోస్టులకు నోటిఫికేషన్

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 26, 2025
‘ఆరావళి’కి తూట్లు.. ఏడేళ్లలో 4 వేల అక్రమ మైనింగ్ కేసులు!

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ అంశం తీవ్ర <<18663286>>వివాదానికి<<>> దారి తీసిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో ఆరావళి పర్వతాలు విస్తరించిన జిల్లాల్లో 4,181 అక్రమ మైనింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లలో మొత్తం 7,173 FIRలు రిజిస్టర్ చేసినట్లు తేలింది. రాష్ట్రంలో 71 వేల ఇల్లీగల్ మైనింగ్ ఘటనలు జరిగితే అందులో ఆరావళి జిల్లాల్లోనే 40 వేలు ఉండటం గమనార్హం.


