News April 24, 2024
నల్లగొండలో శోభాయాత్ర రూట్ MAP ఇదే!
నేడు NLGలో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర కొనసాగే రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. మునుగోడు రోడ్డులోని హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై వీటీ కాలనీ టెంపుల్ వరకు కొనసాగుతుంది. పూల్ సెంటర్, ఓల్డ్ చౌరస్తా, క్లాక్ టవర్, శివాజీ స్టాచ్యూ, ఎల్‌వి ప్రసాద్ హస్పటల్ ల్యాండ్ మీదుగా వీటీ కాలనీ హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. ఈ రోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ రూట్‌లో ఆంక్షలు ఉంటాయి.
Similar News
News December 24, 2024
NLG: గ్రామీణ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి చదువుకున్న గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 30 రోజుల ఉచిత కుట్టు శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. డిసెంబర్ 30 లోపు సంస్థ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.
News December 24, 2024
NLG: సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు!
పేదల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురానుంది. సంక్రాంతికి కొత్తగా తెల్ల రేషన్ కార్డులతో పాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 50వేల మందికిపైగా కొత్త రేషన్ కార్డులతో పాటు తమ పిల్లల పేర్లను చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రైతులకు కూడా రైతు భరోసా అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
News December 24, 2024
ముక్తాపూర్‌తో శ్యామ్ బెనగల్‌కు అనుబంధం!
అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు పద్మశ్రీ శ్యామ్ బెనగల్(90)కు యాదాద్రి జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985లో పారిశ్రామికీకరణతో చేనేత, చేతివృత్తులు ఎలా మసకబారిపోతున్నాయో తెలిపేందుకు ఆయన హిందీలో ‘సుస్మన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో 40 రోజులపాటు చిత్రీకరించారు. ఆ సినిమాలో ప్రముఖ నటుడు ఓంపురి, నటి షబానా అజ్మీ నటించారు.