News July 5, 2024

నల్లగొండ: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 10% రాయితీ

image

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులు సూపర్ లగ్జరీ బస్సులలో అప్ అండ్ డౌన్ ఒకే సారి రిజర్వేషన్ చేయించుకుంటే బస్ ఛార్జీల నుంచి పది శాతం రాయితీనీ పొందవచ్చని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ యం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News July 8, 2024

కొర్లపహాడ్ సమీపంలో ట్రామా కేర్ సెంటర్

image

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక వసతులతో కూడిన ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించాలని ఏడీపీ ప్రతిపాదించింది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ప్రమాదాలకు గురైన సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించే లక్ష్యంతో ఈ సెంటర్ నిర్మాణం చేపడుతోంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే కొర్లపహాడ్ టోల్ ప్లాజాను కీలక జంక్షన్‌గా గుర్తించిన ADP ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

News July 8, 2024

NLG: పలువురు సీఐలకు స్థానచలనం

image

జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. HYD సిటీలో వెయిటింగ్లో ఉన్న కొండల్రెడ్డిని SLG, NLGలో ఉన్న శ్రీనివాసరెడ్డిని ఐజీపీ కార్యాలయానికి, నల్లగొండ వన్ టౌన్ సీఐ సత్యనారాయణను సంగారెడ్డి వీఆర్‌కు, ఇంటలిజెన్స్‌లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని నల్లగొండ వన్ టౌన్‌కు, HYD సిటీ వెయిటింగ్లో ఉన్న క్రాంతికుమార్‌ను NLG ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 8, 2024

NLG: నిర్మించి రెండేళ్లు.. స్థానికంగా ఉండని అధ్యాపకులు!

image

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసిన స్టాఫ్ క్వార్టర్స్ నిరుపయోగంగా మారాయి. రూ. 6.66 కోట్లతో మొత్తం 16 క్వార్టర్స్‌ను నిర్మించారు. నిర్మాణాలు పూర్తై రెండేళ్లు కావొస్తున్నా అధ్యాపకులు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది అధ్యాపకులు నిత్యం HYD నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అధ్యాపకులు స్థానికంగా ఉంటే చదువులు, పరిశోధనల పరంగా మరింత మేలు జరిగే అవకాశం ఉంది.