News January 25, 2025
నల్లగొండ: రూ.500 కోట్లతో జిల్లా అభివృద్ధి: కోమటిరెడ్డి

నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఏడాది కాలంలో రూ.500 కోట్లు మంజూరు చేయించి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. 11లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 11 నీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతిఇంటికి ప్రతిరోజు కృష్ణా తాగునీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News February 16, 2026
నల్గొండ: బందోబస్తు పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్

నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 6 మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
News February 16, 2026
నల్గొండ: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన అధికారిక గణాంకాలు వెల్లడయ్యాయి. మొత్తం 2,40,514 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్‌కు అత్యధికంగా 1,13,149 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ 74,163 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 24,479 ఓట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ ప్రభావం చూపలేకపోయిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ భారీ మెజార్టీతో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
News February 16, 2026
నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్‌లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.


