News November 14, 2024

నల్లగొండ: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం

image

నవంబర్ 15 తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్ఎం M.రాజశేఖర్ గురువారం తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనీ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి పైన సూచించిన సమయంలో 08682 223307 నంబర్‌కు డయల్ చేయాలని కోరారు.

Similar News

News November 15, 2024

వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ త్రిపాఠి సమీక్ష

image

వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం తన చాంబర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఇమ్మునైజేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

News November 15, 2024

గ్రూప్-3 పరీక్షకు 88 కేంద్రాలు ఏర్పాటు: జేసీ శ్రీనివాస్

image

ఈనెల 17, 18 రెండు రోజులు గ్రూప్-3 పరీక్షలు ఉంటాయని, జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ పట్టణాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జేసీ శ్రీనివాస్ తెలిపారు. నల్గొండలో 60, మిర్యాలగూడలో 28, మొత్తం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 28,353 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన చెప్పారు. 17వ తేదీ పేపర్ -1 ఉదయం 10 గంటలకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.

News November 14, 2024

చండూరు అమ్మాయికి అమెరికా అందాల పోటీలో అవార్డు

image

చండూరుకి చెందిన ప్రవాస భారతీయురాలు బావండ్ల రిషితకు మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ 2024-2025 అవార్డు లభించింది. ఈ నెల 11న అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు. బావంద్ల రామ లచ్చయ్య, సత్యమ్మ దంపతుల మూడో కుమారుడే బావండ్ల మాణిక్యం. 14 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.