News April 8, 2025

నల్లజర్ల: పిడుగుపాటుకు ఒకరి మృతి

image

నల్లజర్ల మండలంలోని కృష్ణం గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలులు వీచిన సమయంలో మామిడి చెట్టు కింద ఉన్న వెలగని సత్యనారాయణ అనే వ్యక్తిపై పిడుగు పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News April 17, 2025

రాజమండ్రి: తల్లిదండ్రులు ఒక్కటవ్వాలని కుమార్తె సూసైడ్

image

చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కలిసి ఉండటం చూడలేదు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరంగా ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తన మరణంతోనైనా ఒక్కటిగా ఉండాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. జంగారెడ్డిగూడెంకు చెందిన లేఖశ్రీ 3 ఏళ్ల వయసు నుంచే అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి రవి, తల్లి నాగదుర్గాదేవి రాజమండ్రిలో వేరుగా ఉంటున్నారు. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది.

News April 17, 2025

రిమాండ్ పొడిగింపు.. రాజమండ్రి జైలుకి అనిల్

image

వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగిస్తూ నరసారావుపేటలోని రెండో అదనపు న్యాయాధికారి గాయ్రతి ఉత్తర్వులు ఇవ్వడంతో అతడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఎం, Dy.CM, లోకేశ్‌‌లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

News April 17, 2025

రాజమండ్రి: గోదావరిలో పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి సమీపంలో గోదావరిలో మునిగి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన నారాయణమ్మ రాజమండ్రిలోని ఓంశాంతి ఆశ్రమానికి వచ్చి వెళుతుంటుంది. ఈ విధంగా అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయి ఉంటుందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

error: Content is protected !!