News January 2, 2025
నల్లజర్ల: సినిమా ముహూర్తాల సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత
నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.
Similar News
News January 4, 2025
రాజమండ్రికి మెగాస్టార్ చిరంజీవి..?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ రాజమండ్రిలో గ్రాండ్‌గా జరగనుంది. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుందనే జోష్ అభిమానుల్లో నెలకొంది. సా.6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లేఅవుట్‌లో ఈవెంట్ ప్రారంభం కానుంది.
News January 4, 2025
కాకినాడ జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన
ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ఇప్పటికే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈమేరకు CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నవరం, తుని మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మేరకు ఆ ఏరియాలో 757 ఎకరాలను గుర్తించినట్లు సీఎం నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
News January 4, 2025
తూ.గో: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
జిల్లాలో 15 జూనియర్ కళాశాలలో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా మంత్రి దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న 5,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.