News September 8, 2025

నల్లబెల్లిలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..!

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మండల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి జూనియర్ అసిస్టెంట్‌ను చికిత్స కోసం తరలించినట్లు సమాచారం.

Similar News

News September 9, 2025

విజయవాడ: ‘ముగ్గురుని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు’

image

సూర్యలంక సముద్ర తీరంలో విజయవాడకు చెందిన యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కథనం ..హైదరాబాదు నుంచి వచ్చిన ముగ్గురు సముద్రంలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోవడంతో పక్కనే ఉన్న సాయి వారిని రక్షించబోయి అలల తాకిడికి గల్లంతయ్యాడు. గమనించిన పోలీసులు, గజ ఈతగాళ్లు కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు. కాపాడాలనుకున్న సాయి శవమై తేలాడు. అయితే ప్రాణాలతో భయటపడ్డ ముగ్గురు వెంటనే వెళ్లిపోయినట్లు సమాచారం.

News September 9, 2025

జగిత్యాల: వైద్యులు, సిబ్బందికి హెపటైటిస్ వ్యాక్సిన్

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 9,10,11 తేదీల్లో వైద్యులు, సిబ్బందికి ముందస్తుగా హెపటైటిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్లతో పాటు, ప్రొఫెసర్లు, వైద్యులు, సీహెచ్సీలు, పీహెచ్సీల వైద్యులు, పారిశుధ్య సిబ్బందికి, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ప్రోగ్రాం ఆఫీసర్లకు మూడు విడతల్లో మొత్తం 2,330 డోసులు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News September 9, 2025

చిలిపిచేడ్: విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి

image

వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి కూలి మృతి చెందిన ఘటన చిలిపిచేడ్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. చిట్కూల్ గ్రామానికి చెంది భవానిపల్లి కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలికి వెళ్లి గడ్డి కోత మిషన్‌తో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు