News December 29, 2024

నల్లమలలో టెంపుల్, ఎకో, రివర్ టూరిజానికి ప్రయారిటీ

image

నల్లమల, కృష్ణా నది తీరంలో టెంపుల్, ఎకో, రివర్ టూరిజం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ.65 కోట్లతో ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్లాన్ చేయగా అత్యధికంగా సోమశిలకు కేటాయించారు. నల్లమలలోని అక్కమహాదేవి గుహలు మొదలుకుని సలేశ్వరం, మల్లెల తీర్థం, లొద్దిమల్లయ్య, మద్దిమడుగు, ఆక్టోపస్, ఫర్హాబాద్​ వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుడి కోట​ అభివృద్ధికి రూ.25 కోట్లతో ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నట్లు MLA వంశీకృష్ణ తెలిపారు.

Similar News

News January 1, 2025

పాలమూరు మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహం 

image

జడ్చర్ల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలు గొల్ల భీమమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు చిత్తనూరి రామకృష్ణ మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న విద్యార్థులు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

News January 1, 2025

MBNR: యుజీసీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్

image

జనవరి 3న MBNRలో నిర్వహించే యుజీసీ నెట్ 2024 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే సెంటర్‌ను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. పరీక్షలకు 185 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, నిరంతర విద్యుత్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 31, 2024

గద్వాల: ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, వారికి తమ ఉత్తమ సేవలు గుర్తింపునిస్తాయని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో క్రీడల అధికారి ఆనంద్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి ఆనంద్ విశేష కృషి చేశారని కొనియాడారు. క్రీడా కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.