News December 20, 2025
నల్లమలలో పులి సంచారం.. కృష్ణాతీర గ్రామాల్లో హైఅలర్ట్

<<18614933>>పెద్దపులి<<>> దారి తప్పి కొల్లాపూర్ నల్లమల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కృష్ణానదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా పెద్దపులి సంచరిస్తుందని వదంతులు రాగా.. సోమశిల, యంగంపల్లి, అమరగిరిలో పెద్దపులి జాడలు కనిపించయని కొల్లాపూర్ రేంజ్ అధికారి హుస్సేన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పెద్దపులిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Similar News
News December 20, 2025
ఈ నెల 28 నుంచి అసెంబ్లీ?

TG: ఈ నెల 28 నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ట్ పాలసీ, ఇరిగేషన్, GHMC విలీన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సర్కారు పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో BCలకు పార్టీపరంగా 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 20, 2025
సిరిసిల్ల: పాడె దించి పోస్టుమార్టానికి శవం తరలింపు

పాడెపై శవాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు ఆపి పోస్టుమార్టానికి తరలించిన ఘటన రాజన్నసిరిసిల్ల(D) ఎల్లారెడ్డిపేట(M) రాజన్నపేటలో శనివారం జరిగింది. ఎరుపుల నర్సయ్య(58) శుక్రవారం తన ఇంట్లో మృతిచెందాడు. గుండెపోటుతో నర్సయ్య చనిపోయాడని నమ్మించి దహన సంస్కారాలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లుచేశారు. నర్సయ్య మెడ చుట్టూ నల్లగా ఉండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
News December 20, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ మను చౌదరి

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మను చౌదరి తెలిపారు. రాష్ట్రపతి శీతకాల విడిది ముగించుకుని ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతుండటం, అలాగే విపత్తు నివారణ చర్యలపై జిల్లా యంత్రాంగం మాక్ డ్రిల్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.


