News April 4, 2026

నల్లమలలో ఫైర్ అలర్ట్… అధికారుల తక్షణ చర్యలు

image

నల్లమల అడవిలో అనుమానాస్పదంగా చెలరేగిన అగ్ని ప్రమాదాన్ని అటవీశాఖ అధికారులు వేగంగా అదుపులోకి తీసుకువచ్చారు. రామమూర్తి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ స్వయంగా ఫైర్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం విశేషం. అడవుల్లో మంటలు పెట్టడం తీవ్రమైన నేరమని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అటవీ సంరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 4, 2026

JGTL: విదేశాలకు వెళ్దామనుకున్నాడు.. అంతలోనే విషాదం

image

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవల్లికి చెందిన గాలిపల్లి ఆదిత్య(21) శుక్రవారం రాత్రి మేడిపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటర్ వరకు చదివిన ఆదిత్య జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. ఆదిత్య మృతి పట్ల సర్పంచ్ భవాని సంతాపం వ్యక్తం చేశారు.

News April 4, 2026

విశాఖ: అధునాతన నావికా పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన

image

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ (NSTL)లో లార్జ్ కేవిటేషన్ టన్నెల్ (LCT) ప్రాజెక్టుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ అత్యాధునిక సదుపాయం డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో నిర్మాణం కానుంది. నౌకల హైడ్రోడైనమిక్ పరిశోధన, పరీక్షలను దేశీయంగా నిర్వహించేందుకు ఇది దోహదం చేస్తుంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.

News April 4, 2026

తెలంగాణ టార్గెట్‌బాల్ కోచ్‌గా నగేష్

image

సూర్యాపేట జిల్లా గారకుంట తండాకు చెందిన గుగులోతు నగేష్ తెలంగాణ టార్గెట్‌బాల్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. ఉత్తరాఖండ్‌లో ఈ నెల 4 నుంచి 7 వరకు జరిగే 13వ సీనియర్ నేషనల్ పోటీలకు ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. గిరిజన యువకుడికి ఈ అవకాశం దక్కడంపై సర్పంచ్ అరుణ రమేష్, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నగేష్ నియామకాన్ని స్టేట్ అసోసియేషన్ సెక్రెటరీ బాబు నాయక్ అధికారికంగా వెల్లడించారు.