News July 5, 2024

నల్లమల్ల పర్యటనకు పాలమూరు ఎమ్మెల్యేలు

image

నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటనకు బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమల్లలో పర్యటించి ఇక్కడ నెలకొన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.

Similar News

News July 8, 2024

కృష్ణా జలాశయాలు లేక రైతులు ఆందోళన

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఎకరాలకు కేఎల్ ద్వారా సాగు నీరందడంతో పాటు 300 గ్రామాలకు పైగా 500 చెరువులతో పాటు దుందుభీ నదిలో సైతం కృష్ణా జలాలతో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం నెలరోజులు పూర్తైనా ఇంకా కృష్ణా జలాశయాలు డెడ్జోరేజీలో ఉండటంతో పరివాహక ప్రాంత రైతులందరూ ఆందోళన చెందుతున్నారు.

News July 8, 2024

MBNR: జిల్లాకు అవసరమైన ఎరువుల రెడీ

image

వానాకాలం సీజన్లో రైతులకు కావలసిన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు అవసరమైన 54,104 మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే బఫర్ స్టాక్ గోదాంకు తరలించామని తెలిపింది. గతేడాది వరకు అమల్లో ఉన్న విధానంపై సమీక్ష చేసి ఒకవైపు డీలర్లకు, మరోవైపు మార్క్ ఫెడ్కు చెరిసగం ఎరువులు కేటాయించేలా శాఖ చర్యలు తీసుకుంది.

News July 8, 2024

MBNR: ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం: మంత్రి

image

ఉమ్మడి జిల్లాకు MBNR- RRతోపాటు మిగతా అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, MLAలతో కలిసి ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పర్యాటక అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్‌పై చర్చించారు.