News November 17, 2024

నల్లమల అడవుల్లో పెరిగిన పులుల సంతతి

image

నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో పులుల సంతతి పెరిగినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం 34 పెద్ద పులులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 87 చేరినట్లు వెల్లడించారు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అడవుల్లోకి ఎవరినీ రానివ్వకుండా చేయడంతో పాటు పలు నిబంధనలు పెట్టి, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Similar News

News October 5, 2025

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

image

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

News October 4, 2025

1100కు ఫోన్ చేయండి: కలెక్టర్

image

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని లెక్టర్ సిరి శనివారం వెల్లడించారు. అర్జీదారులు meekoస్am.ap.gov.in వెబ్ సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మండల కేంద్రంలో, మున్సిపాల్టీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 4, 2025

ఎస్సీ,ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందించండి: కలెక్టర్

image

ఎస్సీ,ఎస్టీ కేసులు బాధితులకు పరిహారం అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాధితులకు పరిహారం అందించాలన్నారు.