News January 12, 2026

నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం లేదు: చంద్రబాబు

image

AP: నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల మీటింగ్‌లో CM CBN తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం ద్వారా నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దీనివల్ల సాగర్, శ్రీశైలంలో మిగులుజలాలను AP, TG వాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. అందరం కలిసి పనిచేసుకుందామని TGకి కూడా చెప్పానన్నారు.

Similar News

News February 2, 2026

కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.

News February 2, 2026

హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>HYD<<>>లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌‌(IIMR)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ( అగ్రికల్చర్ సైన్స్, లైఫ్ సైన్స్), PG(అగ్రికల్చర్ ఎకనామిక్స్/ABM/అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్& అల్లైడ్ సైన్స్/ అగ్రికల్చర్/ ఫుడ్ టెక్నాలజీ), BE, BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. FEB 5, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.millets.res.in/

News February 2, 2026

పిండి దీపం ఎలా తయారుచేయాలి?

image

పావుశేరు బియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టి, నీరు వడగట్టి నీడన ఆరబెట్టాలి. అనంతరం ఆ బియ్యాన్ని మెత్తని పిండిలా మిల్లులో పట్టించాలి. ఈ పిండిలో తగినంత బెల్లం తురుము, ఆవు నెయ్యి కలిపి ముద్దలా చేయాలి. ఈ ప్రక్రియ అంతా శుచిగా చేయాలి. ఆ ముద్దను ప్రమిద ఆకారంలో మలచి, మధ్యలో దీపం వెలిగించడానికి వీలుగా గుంటలా చేసి సిద్ధం చేయాలి. కుదిరితే ఆ దీపంపై గోవింద నామాలు దిద్దడం మరింత శ్రేయస్కరం.