News March 1, 2025

నల్లొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు: కలెక్టర్ 

image

చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 1, 2025

టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

image

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.

News March 1, 2025

ఏటేటా తగ్గుతున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు!

image

నల్గొండ జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో జిల్లాలో 2,78,667 మంది అర్హులు ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చనిపోయిన, భూములను అమ్ముకున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను ఏటా జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో 19వ విడతలో 1,08,651 మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నట్టు తెలుస్తోంది.

News March 1, 2025

మర్రిగూడ: లైంగిక దాడి కేసులో జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తికి 16నెలల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కులకర్ణి విశ్వనాథ్ తీరునిచ్చారు. వివరాలిలా.. మర్రిగూడ మండలం శివన్నగూడెంకి చెందిన నర్సిరెడ్డి 2017లో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచగా.. 16నెలల శిక్ష, రూ.1500 జరిమానా విధించారు.

error: Content is protected !!