News October 8, 2025
నల్ల చెరకుకు కేరాఫ్ బల్లికురవ

నల్లచెరుకు సాగుకు కేరాఫ్‌గా బల్లికురవ మండలం నిలుస్తోందని రైతులు అంటున్నారు. మొదట్లో 5 ఎకరాలతో మొదలైన సాగు కూకట్లపల్లి, కొత్తూరు, రామాంజనేయపురం, కొప్పరపాడు గ్రామాల్లో ప్రస్తుతం 800 ఎకరాల్లో విస్తరించి జిల్లాలోని మొదటి స్థానంలో ఉందని అధికారులు అంటున్నారు. తినడానికి వీలుగా ఉండే నల్లచెరుకు (జనగాం రకం) గడ రూ.20ల చొప్పున రాష్ట్రంలోని వ్యాపారులు చేలవద్దే కొనుగోలు చేస్తున్నారన్నారు.
Similar News
News October 8, 2025
అనకాపల్లి: 9 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు

ఉమ్మడి విశాఖ జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా ఇంటర్ అధికారి వినోద్ బాబు తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగే ఎంపిక పోటీల్లో 2007 తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. గోపాలపట్నంలో 9న బ్యాట్మెంటన్, నక్కపల్లిలో 10న హాకీ, పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల కబడ్డీ, క్రికెట్, చెస్ వాలీబాల్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు.
News October 8, 2025
‘అనకాపల్లి-తిరుపతి ట్రైన్‌లో జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలి’

అనకాపల్లి-తిరుపతి స్పెషల్ ట్రైన్‌లో సామాన్య ప్రయాణికులకు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం అనకాపల్లి నుంచి నడిచే ఈ రైల్లో అన్ని ఏసీ బోగీలో కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు నిరాశ పడుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు.
News October 8, 2025
విజయవాడ పశ్చిమ బైపాస్‌ను వేధిస్తున్న టవర్ల సమస్య

97% మేర పూర్తైన పశ్చిమ బైపాస్ పనులకు అపరిష్కృతంగా ఉన్న టవర్ల సమస్య ఆటంకంగా మారింది. రహదారి వెళ్లే మార్గంలోని హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్ల ఎత్తు పెంచితే మిగతా పనులు పూర్తి కానుండగా.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అనుమతులు వస్తే మిగతా పనులు పూర్తై రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.