News January 1, 2026
నల్ల నువ్వులతో గ్రహ దోషాలు దూరం: పండితులు

గ్రహ దోషాల వల్ల కలిగే శత్రు బాధలు, ఆటంకాల నుంచి ఉపశమనానికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. శనివారం సాయంత్రం నువ్వుల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయడం, పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే అమావాస్య రోజున పితృ దేవతలకు తిల తర్పణం వదిలితే వారి ఆశీస్సులు లభించి కష్టాలు తొలగిపోతాయి. భక్తితో పాటు మంచి ప్రవర్తన ఉంటే ఈ పరిహారాలు శీఘ్ర ఫలితాలనిస్తాయి.
Similar News
News January 1, 2026
చెడు శకునాలు ఎదురైతే?

చెడు శకునాలు ఎదురైనా, అశుభ సంకేతాలు కనిపించినా కొన్ని మార్గాలతో దోష నివారణ చేసుకోవచ్చు. ‘పసుపు కలిపిన గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ విభూతి, తులసి తీర్థం చల్లాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. విజ్ఞులు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దానధర్మాల వల్ల ఆపదల తీవ్రత తగ్గుతుంది. శకునాలు హెచ్చరికలు మాత్రమేనని, సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా కష్టాలను దాటొచ్చని పండితులు చెబుతున్నారు.
News January 1, 2026
ఈనెలలోనే అందుబాటులోకి వందేభారత్ స్లీపర్: కేంద్ర మంత్రి

వందేభారత్ స్లీపర్ రైలు జనవరిలో అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో తొలి రైలు పరుగులు పెడుతుందని తెలిపారు. 3 టైర్ కోచ్‌లు 11, 2 టైర్ 4, ఫస్ట్ AC కోచ్ 1 ఉంటుందని మొత్తం 823 పాసింజర్లు ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే 6 నెలల్లో మరో 8, ఏడాది చివరికి 12 ట్రైన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. 15-20 రోజుల్లో సర్వీసులు స్టార్ట్ అవుతాయని చెప్పారు.
News January 1, 2026
మీ త్యాగం వల్లే ఈ సెలబ్రేషన్స్.. సెల్యూట్❤️

లోకమంతా న్యూఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. మనం ఇక్కడ మిత్రులతో విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తుంటే.. గడ్డకట్టే హిమపాతంలో కుటుంబానికి దూరంగా సైనికులు దేశం కోసం పహారా కాస్తున్నారు. వారు చేస్తున్న సేవ, త్యాగం వల్లే మనం సురక్షితంగా వేడుకలు జరుపుకోగలుగుతున్నాం. ఆ వీర జవాన్లందరికీ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం.


