News September 10, 2025
నవంబర్ 10 నుంచి 23వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ: HNK కలెక్టర్

జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాగా, ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహణపై కలెక్టరేట్లో ఆర్మీ, పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు.
Similar News
News September 10, 2025
HYD: పోటెత్తిన వరద.. జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో బుధవారం గేట్లు తెరిచారు. హిమాయత్‌సాగర్ ఒక గేటు ఎత్తి 671 క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు విడుదల చేశారు. హిమాయత్‌సాగర్ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.55 అడుగులు, గండిపేట పూర్తి స్థాయి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,789.15 అడుగుల నీరుంది.
News September 10, 2025
గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: కలెక్టర్

బుద్ధారం గురుకుల బాలికల కళాశాలను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాన్ని బోధించి వారిని ప్రోత్సహించాలని టీచర్లకు సూచించారు.