News October 31, 2024

నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో ప్రతి రోజు కార్తీక దీపోత్సవం: ఈఓ

image

కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో వనదుర్గమాత ఆలయం వద్ద ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక దీపోత్సవం జరుగుతుందని ఈఓ చంద్రశేఖర్ రావు తెలిపారు. మట్టి ప్రమిదలు దేవస్థానం నుంచి ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, పల్లకి సేవ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సాయంత్రం దీపాలు వెలిగించడం జరుగుతుందన్నారు.

Similar News

News November 2, 2025

మెదక్: రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న మూడు రోజుల్లో మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం తెలిపారు. ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడాలని, రైతులకు వర్షం వల్ల ఎలాంటి అసౌకర్యం, ధాన్యం తడిచి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

News November 2, 2025

మెదక్: స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు: కలెక్టర్

image

భూభారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన 10 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో సత్ఫలితాలు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం పై కలెక్టర్ ఆదివారం వివరించారు. 10 రోజుల్లో తహశీల్దార్‌ల పరిధిలో 183, ఆర్డీవోల పరిధిలో 661, కలెక్టర్ స్వయంగా 168 ఫైల్స్ క్లియర్ చేసి జిల్లాలో 1012 దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించినట్లు తెలిపారు.

News November 2, 2025

మెదక్: KGBVలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అకౌంటెంట్, ఏఎన్ఎన్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO రాధాకిషన్ తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు వివరాలకు కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.