News November 3, 2025
నవంబర్ 3: చరిత్రలో ఈరోజు

*1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి జననం
*1906: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
*1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ జననం
*1937: ప్రముఖ సింగర్ జిక్కి జననం
*1940: విప్లవ రచయిత వరవరరావు జననం
*1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం
*జాతీయ గృహిణుల దినోత్సవం
Similar News
News November 3, 2025
కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.
News November 3, 2025
కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

క్రికెట్‌లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్‌జ్యోత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు అపూర్వ విజయం దక్కింది.
News November 3, 2025
APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.


