News January 3, 2026

నవగ్రహాలను దర్శించుకొని కాళ్లు కడగకూడదా?

image

అలా కడగకూడదని పండితులు చెబుతుంటారు. అలా కడిగితే గ్రహాల శక్తి తరంగాలు మనపై చూపించే సానుకూల ప్రభావం, పుణ్యఫలం తగ్గిపోతుందని అంటారు. అయితే ఆలయం నుంచి ఇంటికి వెళ్లి, కొద్ది సమయం తర్వాత కడుక్కోవచ్చట. నవగ్రహాల ప్రదక్షిణలు ముగించి, కాసేపు అక్కడ కూర్చుని, ఆ గ్రహాల అనుగ్రహాన్ని స్మరించుకుని బయటకు రావాలట. ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్లు కడగడం వల్ల దోష నివారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మకం.

Similar News

News February 17, 2026

కర్తరీ దోషం అంటే ఏమిటి?

image

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.

News February 17, 2026

మామిడి పంట.. ఈ దశలో పోషకాలు అందించండి

image

మామిడి పిందెలు బఠాణీ లేదా గోళీకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లకు మరోసారి పోషకాలను అందించాలంటున్నారు నిపుణులు. ఈ దశలో లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10-15 గ్రా., యూరియా లీటరు నీటికి 10 గ్రా. మరియు అర్కమ్యాంగో స్పెషల్ లీటరు నీటికి 5గ్రా. లేదా ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుకు వచ్చి అధిక బరువు పెరుగుతాయి.

News February 17, 2026

ఇవాళ్టి నుంచి CBSE బోర్డు పరీక్షలు!

image

CBSE 10, 12వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది టెన్త్‌, 18.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారు. రోజూ 10.30AM-1.30PM మధ్య ఎగ్జామ్స్ జరుగుతాయి. 10AM తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రెగ్యులర్ విద్యార్థులు స్కూల్ డ్రెస్‌లో రావాలి. ప్రైవేటు స్టూడెంట్లు సాధారణ దుస్తుల్లో రావచ్చు. టెన్త్ విద్యార్థులకు మే నెలలో <<19159258>>రెండో విడత<<>> పరీక్షలు జరుగుతాయి.