News August 20, 2024
నవబ్రహ్మ ఆలయాలపై కేంద్ర బృందం రీసర్చ్ !

7వ శతాబ్దాలనాటి అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలపై ఆర్కియాలజికల్ కేంద్ర అధ్యయన బృందం మంగళవారం అలంపూర్ సందర్శించింది. ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ మహాలక్ష్మీ బృందం నవబ్రహ్మ ఆలయాలను సందర్శించి ఇక్కడి అర్కిటెక్చర్, శాసనాలు సంస్కృతి సాంప్రదాయాలపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో అలంపూర్ ఆలయాలు సంతృప్తినిచ్చాయన్నారు. ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News February 28, 2026
మహబూబ్‌నగర్: వచ్చే నెల 4న హోలీ పండుగ

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు హోలీ పండుగను మార్చి 4వ తేదీన నిర్వహించాలని జిల్లా బ్రాహ్మణ సంఘం తెలిపింది. జ్యోతిష్య పండితులచే చర్చించిన అనంతరం 2వ తేదీన కామ దహన కార్యక్రమం నిర్వహించాలని, 3న చంద్రగ్రహణం ఉన్నందున4వ తేదీన హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు.
News February 28, 2026
జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

జడ్చర్ల మండలం మల్లేబోయిన్‌పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి పెద్ద మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని మిగిల్చింది. చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.
News February 28, 2026
MBNR: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత: ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని, ప్రతి పౌరుడు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, సీఐలు శ్రీనివాస్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.


