News September 5, 2025

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్

image

భూపాలపల్లి పట్టణంలో గణపతి నిమజ్జనం సందర్భంగా ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News September 6, 2025

ఖమ్మం: సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న MEO

image

నేలకొండపల్లి MEO బాలిన చలపతిరావు ఉత్తమ హెడ్మాస్టర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఉపాధ్యాయ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఈఓ చలపతిరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News September 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 6, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.50 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
✒ ఇష: రాత్రి 7.39 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 6, 2025

BREAKING: రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

image

TG: హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంలో రికార్డ్ సృష్టించింది. రాజేంద్రనగర్‌ సన్ సిటీలోని రిచ్‌మండ్ విల్లాలో ఏకంగా రూ.2.32కోట్లు పలికింది. ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా హాజరవుతుంటారు. ఈసారి రూ.కోటి నుంచి వేలం మొదలుపెట్టినట్లు సమాచారం.