News January 6, 2026

నవాబుపేట: ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ మృతి

image

నవాబుపేట మండలంలోని మీనపల్లి కలాన్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో, డ్రైవర్ గొల్ల శ్రీశైలం (37) కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News February 20, 2026

నానబెట్టిన మెంతులు మంచివేనా?

image

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

News February 20, 2026

తీగ చిక్కుడులో ఆముదం మొక్కలు ఎందుకంటే?

image

తీగ చిక్కుడు పంటను సాగు చేసే కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆముదం మొక్కలను తీగ చిక్కుడు పంటలోని ప్రతి ఆరు అడుగులకు ఒకటి చొప్పున నాటుతున్నారు. దీని వల్ల చీడపీడల సమస్య తగ్గడంతో పాటు ఆముదం మొక్కలు పెరిగాక వాటి ఆకులు తీగ చిక్కుడుకు షేడ్‌నెట్‌లా పనిచేస్తున్నాయి. ఫలితంగా చిక్కుడు పంటపై ఎండ తీవ్రత తగ్గి మంచి దిగుబడి వస్తోందని, ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతులు చెబుతున్నారు.

News February 20, 2026

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు..!

image

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ MLC అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం మండలి సమావేశాలకు హాజరైన ఆయన అకస్మాత్తుగా గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఒంటరిగా వెళ్లిపోయారని సమాచారం. కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇటీవల అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను సిట్ ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు.