News December 15, 2025
నవాబ్‌పేట్‌లో గెలుపొందిన సర్పంచ్‌లు వీళ్లే..

వట్టిమీనపల్లి- సుక్కమ్మొళ్ళ మాణెమ్మ (బీఆర్‌ఎస్)
మూలమాడ – కందాడ స్వాతి (బీఆర్‌ఎస్)
అత్తాపూర్ -మేకల సంతోష్‌రెడ్డి (కాంగ్రెస్)
ఎక్‌మామిడి – మహిళ నర్మద (కాంగ్రెస్)
ఎత్‌రాజ్‌పల్లి – మల్గారి జగన్‌రెడ్డి (బీఆర్‌ఎస్)
చించల్‌పేట – -గుడిసె అనుసూజ (కాంగ్రెస్)
ముబారక్‌పూర్ ఎస్సీ జనరల్ జామ జేజయ్య (స్వతంత్ర)
Similar News
News December 17, 2025
విజయోత్సవాలకు అనుమతి లేదు: వరంగల్ సీపీ

మూడో విడత ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకున్నారని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా కౌంటింగ్ అనంతరం జరుపుకునే విజయోత్సవాలకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదని, అలాంటి వాటికి తప్పనిసరిగా పోలీసుల అధికారుల అనుమతి తీసుకోవాలని అన్నారు.
News December 17, 2025
నల్గొండ: ఓట్ల కోసం నోట్ల వరద.. రూ.కోట్లలో ఖర్చు

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం హద్దులు దాటిందని ప్రజలు అంటున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. చిన్న పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేయగా, కీలక పంచాయతీల్లో అభ్యర్థులు రూ.కోటికి మించి పంపిణీ చేశారన్నారు. గెలిచినవారితో పాటు ఓడినవారు కూడా ఖర్చును తలచుకుని మదనపడుతున్నారు. క్రాస్ ఓటింగ్‌తో లెక్కింపు ఉత్కంఠగా మారింది.
News December 17, 2025
ఖమ్మం: వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

ఖమ్మం జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ అనుదీప్ నిశితంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పోలింగ్ సరళిని వీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, ఓటింగ్ విధానంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.


