News January 22, 2025
నవీపేటలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను ఇద్దరు మైనర్లు (12), (13) శనివారం ఆడుకుందామని పిలిచి లైంగిక దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.
Similar News
News July 9, 2025
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
News July 9, 2025
తెలంగాణకు యూరియా కోత.. కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

తెలంగాణకు యూరియా కేటాయింపులు 45% తగ్గించడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. రాజకీయ ప్రేరణతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా యూరియాను సరఫరా చేసి, తెలంగాణను ఉపేక్షించడం అన్యాయమన్నారు. RFCLలో తయారైన యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను: గోపాలకృష్ణ

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీ-4 పథకంపై ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, వారికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.