News January 29, 2025
నవీపేట్: జీవితం మీద విరక్తి చెంది వ్యక్తి మృతి
నవీపేట్ మండలం పాల్దే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి నిర్మాణం చేపట్టి అప్పులు ఎక్కువ కావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అతని భార్య వెంటనే 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 30, 2025
NZB: నేడు జిల్లా వ్యాప్తంగా BRS నిరసనలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్లు BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టనున్నామన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలో గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
News January 30, 2025
ఎత్తొండ: ఆరుగురు అధికారులపై వేటు
కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలోని సహకార కేంద్ర సంఘం బ్యాంకు భారీ అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ఆరుగురు అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సరైన రికార్డు నిర్వహణ లేకపోవడంతో కార్యవర్గాన్ని రద్దు చేస్తూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఎత్తొండ సహకార కేంద్ర సంఘానికి ఆదేశాలు జారీ అయ్యాయి.
News January 30, 2025
రుద్రూర్ చెరువులో చేపల వల చుట్టుకొని యువకుడి మృతి
రుద్రూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో బాబన్న(22) అనే యువకుడు చేపల వల చుట్టుకుని ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. బుధవారం ఉదయం నుంచి బాబన్న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించారు. సాయంత్రం చెరువులో బాబన్న మృతదేహం కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ వివరించారు.