News November 1, 2025
నవీపేట్: మహిళ దారుణ హత్య?

నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన వివస్త్రగా గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నవీపేట్ ఎస్ఐ తిరుపతి వివరాలు సేకరిస్తున్నారు. తల, కుడిచేయి వేళ్లు లేకుండా మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News November 1, 2025
ములుగు: యువకులకు గన్ ఎక్కడిది..?

ములుగు జిల్లాలో గన్‌తో యువకులు బెదిరింపులకు పాల్పడిన ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ముగ్గురు యువకులను వరంగల్ టాస్క్ ఫోర్స్ టీం అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుల వద్ద ఉన్న గన్ ఒరిజినలేనా..? దాన్ని ఎవరూ ఇచ్చారు. వాళ్లు ఎరిరెవరిని బెదిరించిచారు..? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
News November 1, 2025
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్

నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ టాలీవుడ్ సింగర్ పీవీఎన్‌ఎస్ రోహిత్ తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు గానూ ఆయన జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News November 1, 2025
APPLY NOW: CSIR-IMMTలో సైంటిస్ట్ పోస్టులు

భువనేశ్వర్‌లోని CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(IMMT)లో 30 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.immt.res.in/


