News March 1, 2025
నవోదయం 2.0 కరపత్రాలు విడుదల

శ్రీ సత్యసాయి జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ చేతన్ తెలిపారు. జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమంపై కలెక్టర్ గోడ పత్రికలు విడుదల చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News February 22, 2026
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. కప్ మనదే

ఏసీసీ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 ఫైనల్స్‌లో భారత-A జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు 134 పరుగుల చేసింది. 135 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్-A మహిళల జట్టు 88 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రేమ రావత్ 3.. సోనియా, తనూజా తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. 46 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.
News February 22, 2026
సంగారెడ్డి: త్వరలోనే రూ.20,737 కోట్లతో RRR పనులు

రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్పల్లి వరకు 161.5 కి.మీల మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్‌హెచ్-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
News February 22, 2026
ఫేక్ వార్తలు నమ్మొద్దు: బాపట్ల కలెక్టర్

సచివాలయాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభమయ్యాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ అప్లికేషన్ ఫారాలను నమ్మవద్దని సూచించారు. పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే, భార్యకు వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రమే ప్రస్తుతం ఉందన్నారు. కొత్త పింఛన్లపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చేవరకు వదంతులు నమ్మొద్దని కోరారు.


