News December 10, 2025

నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ విజయ

image

జవహర్ నవోదయవిద్యాలయంలో 2026-27విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై నిర్వహించే ప్రవేశ పరీక్షకు జిల్లాలో 6పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. ఈనెల 13న ఉదయం 11:30నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్ష నిర్వహింపబడుతుందన్నారు. జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, మెదక్‌లో 4, నర్సాపూర్, రామాయంపేటలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

Similar News

News December 11, 2025

మెదక్: 312 వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో ఎన్నికల పర్యవేక్షణ

image

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలను కలెక్టరేట్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెబ్‌కాస్టింగ్ కెమెరాలను ఆయన పరిశీలించారు. ఆరు మండలాల్లో జరిగే ఎన్నికల కోసం 312 వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, డీపీఆర్‌ఓ రామచంద్ర రాజు పాల్గొన్నారు.

News December 10, 2025

MDK: బాండ్ పేపర్ హామీలకు ఓట్లు వచ్చేనా?

image

ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ హామీల ట్రెండ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ బాండ్ ఇచ్చిన మాదిరిగానే జీపీ ఎన్నికల్లో అనేకచోట్ల బాండ్ పై అనేక హామీలతో కూడిన వాగ్దానాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనని అభ్యర్థులు, ప్రజలు చూస్తున్నారు. శాసనసభ, లోక్‌సభ మాదిరిగా జీపీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు గ్రామ ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తున్నారు.

News December 10, 2025

మెదక్: 3వ విడతలో 20 జీపీలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మూడవ విడతలో జరిగే ఎన్నికల్లో 20 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. 183 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. మండలాల వారీగా చిలప్ చెడ్-2, కౌడిపల్లి-7, కుల్చారం-3, నర్సాపూర్-2, శివంపేట- 3, వెల్దుర్తి-3 గ్రామపంచాయతీలలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.