News July 7, 2025
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను https://navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రవేశాలకు డిసంబర్ 13న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్‌ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.
News July 7, 2025
JNTU: రేపటితో ముగియనున్న మొదటి విడత కౌన్సెలింగ్

TG EAPCET ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో కొనసాగుతున్న మొదటి దశ కౌన్సిలింగ్ పక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల నమోదు పక్రియ ప్రారంభించారు. ఇలా పదో తేదీ వరకు విద్యార్థులు వారికి నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 171 ఇంజినీరింగ్ కళాశాలలో 1,07,218 సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి అధికారులు తీసుకొనివచ్చారు.
News July 7, 2025
NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.