News November 25, 2025
నవ రసాలపాట.. నరసరావుపేట

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నవరసాలలో ప్రఖ్యాతి గాంచింది. ఆధ్యాత్మిక, రాజకీయ, సాహిత్య, పత్రికా రంగాలలో ఇక్కడినుంచి ఎందరో ప్రముఖులు ప్రసిద్ధి చెందారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, తొలి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య, నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, త్రివేణి పత్రిక సంపాదకులు కోలవెన్ను రామకోటేశ్వరరావు, మీసాల కృష్ణుడు బెల్లంకొండ సుబ్బారావు ఇక్కడి వారే.
Similar News
News November 25, 2025
మెదక్: అన్నా.. మీరు సపోర్టు నాకే ఇవ్వాలి..!

స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో ఆశావాహులు తమకే మద్దతు ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. చిన్నాన్న-పెద్దబాపు, అక్కా- తమ్మడు మీ సపోర్టు ఇవ్వాలంటూ పలకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ నేతల ఆధిపత్యం కొనసాగడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు వరుస కడుతున్నారు. గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
News November 25, 2025
CCRHలో 90 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH )లో 90 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in
News November 25, 2025
ములుగు:5 నిమిషాల్లో లోన్.. మోసపోకండి

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ములుగు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. 5 నిమిషాల్లో లోన్ ఇస్తామని చెప్పగానే మోసపోవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయొద్దని సూచించారు. ఆన్లైన్లో ఆధార్, పాన్ కార్డ్ పంపించొద్దని, ఫోను ద్వారా ఎలాంటి యాక్సెస్ ఇవ్వద్దని హెచ్చరించారు. మీ అవసరమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అన్నారు. జాగ్రత్తలు వహించాలన్నారు.


