News November 4, 2025
నష్టాలను పూడ్చే గరిక నీటి అభిషేకం

వినాయకుడికి గరిక ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాంటి గరిక కలిపిన నీటితో శివ లింగానికి అభిషేకం చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వల్ల నష్టపోయినదంతా తిరిగి పొందుతారని అంటున్నారు. ‘ఈ అభిషేకానికి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకునే శక్తి కూడా ఉంటుది. జీవితంలో ఎదురైన ఆటంకాల నుంచి బయటపడి, పూర్వ వైభవం పొందడానికి ఈ అభిషేకం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.
Similar News
News November 4, 2025
లాబీయింగ్ చేస్తేనే నేషనల్ అవార్డులు: ప్రకాశ్‌రాజ్

లాబీయింగ్ చేసేవారికే నేషనల్ అవార్డులు వస్తున్నాయని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి జాతీయస్థాయి గుర్తింపు రాకపోవడం విచారకరమన్నారు. లాబీయింగ్‌తో వచ్చే అవార్డులు ఆయనకు అవసరం లేదని చెప్పారు. కేరళ జ్యూరీలో ఛైర్మన్‌గా తనకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పి తరువాత సభ్యులు జోక్యం చేసుకున్నారని అక్కడి ఫిలిం అవార్డుల ప్రదానం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.
News November 4, 2025
ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి జరిగితే మేమొస్తాం: బీజేపీ

తన కొడుకు పెళ్లి అన్నట్లుగా బిహార్‌లో ప్రధాని మోదీ తిరుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ దిగజారుడుతనమని మండిపడింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేసింది. ‘ఖర్గేజీ మీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్) పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం కచ్చితంగా హాజరవుతాం’ అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
News November 4, 2025
న్యూస్ అప్‌డేట్స్

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం


