News December 29, 2025
నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 26,018 వద్ద, సెన్సెక్స్ 104 పాయింట్లు కుంగి 84,936 వద్ద ఉన్నాయి. టాటా స్టీల్, ఎటర్నల్, టైటాన్, టెక్ మహీంద్రా, TMPV షేర్లు లాభాల్లో.. అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, HCL టెక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
Similar News
News February 15, 2026
అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్: CM

TG: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని CM రేవంత్ తెలిపారు. HYDలో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘4నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నా. ఈ ప్రస్థానంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారు. భూముల గురించి, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించకూడదు. బాగా చదువుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుపడతాయి’ అని వ్యాఖ్యానించారు.
News February 15, 2026
ఇండియా Vs పాక్.. జట్లు ఇవేనా?

ఇవాళ్టి హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇండియా, పాక్ జట్లు రెడీ అవుతున్నాయి. ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. జట్ల అంచనా ఇలా..
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య(C), హార్దిక్, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, సుందర్/కుల్దీప్, బుమ్రా, వరుణ్.
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్ అఘా(C), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఫహీమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రీది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, సల్మాన్ మీర్జా.
News February 15, 2026
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసాకు ‘2-బకెట్ స్ట్రాటజీ’

రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ‘2-బకెట్ స్ట్రాటజీ’ బెస్ట్ వే. ఇందులో మీ పెట్టుబడులను ‘సేఫ్’ (FD, EPF, PPF), ‘గ్రోత్’ (ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్) బకెట్లుగా విభజించాలి. రిటైర్మెంట్‌కు దగ్గరయ్యే కొద్దీ రిస్క్‌ను తగ్గించుకుంటూ ప్లాన్ మార్చుకోవాలి. రిటైర్ అయ్యాక కూడా కొంత మొత్తాన్ని గ్రోత్ బకెట్‌లో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించొచ్చు.


