News January 7, 2026

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 84,920 వద్ద.. నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 26,122 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టైటాన్, ఇన్ఫీ, HCL, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు లాభాల్లో.. TMPV, HDFC, ఎయిర్‌టెల్, మారుతీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

Similar News

News February 3, 2026

TTD లడ్డూ నెయ్యి కల్తీ వెనుక ఎవరున్నారో తేలుద్దాం: క్యాబినెట్లో చర్చ

image

AP: TTD నెయ్యి కల్తీలో తెర వెనుక ఎవరున్నారో తేల్చాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో సిట్ ఛార్జ్‌షీట్‌పై మంత్రులు చర్చించారు. కల్తీ నెయ్యి ఎక్కడ తయారైంది? దాన్ని ఎలా గుర్తించారు? దీనిలో భాగస్వాములెవరు? ఇలా విచారణలో వెలుగు చూసిన వాస్తవాలన్నిటినీ ప్రజలకు వివరించాల్సిన అవసరముందని మంత్రులు అభిప్రాయపడ్డారు. SCకి సిట్ అందించిన నివేదిక బహిర్గతం అయ్యాక మరోసారి చర్చించనున్నారు.

News February 3, 2026

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

image

ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్‌లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకోనుంది. 2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్‌సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ T20 WC కెప్టెన్‌గా బరిలో దిగనున్నారు. ఈయన గతంలో PSL, BPL, హండ్రెడ్ లీగ్‌లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరఫున 2023లో అరంగేట్రం చేశారు.

News February 3, 2026

అందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారు: రాహుల్

image

ప్రధాని మోదీ తన ఇమేజ్ పోతుందనే భయపడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. USలో అదానీ గ్రూప్‌పై ఉన్న కేసు నిజానికి మోదీ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసేందుకు పెట్టినదని ఆరోపించారు. అలాగే ఎప్‌‌స్టీన్ ఫైల్స్‌ విషయంలోనూ మోదీ ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఇందులో ఎన్నో కీలక విషయాలు ఉన్నాయని.. వాటిని ఇంకా US రిలీజ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇందుకే ప్రధాని భయంతో ఉన్నారని ఆరోపించారు.