News January 5, 2026

నష్టాల్లో మార్కెట్స్.. IT సెక్టార్ డౌన్

image

భారత సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా నష్టపోయి 85,570 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 26,300 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2% వరకు నష్టాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి దిగ్గజ ఐటీ సంస్థల స్టాక్స్ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Similar News

News February 3, 2026

42% సీట్లు ఏవి?: పార్టీలకు BCల సెగ

image

TG: మున్సి‘పోల్స్’లో నామినేషన్లు ముగిశాయి. చాలా చోట్ల పార్టీ టికెట్ల కోసం గొడవలు జరిగాయి. స్థానిక సంస్థల్లో BCలకు 42% సీట్లు ఇస్తామన్న INC, BRS, BJPకి వారి నుంచి అసంతృప్తి సెగ గట్టిగానే ఉంది. అధికారిక 32% రిజర్వేషన్ సీట్లు సహా మిగతా వాటిని పార్టీ పరంగా ఇస్తామన్నాయి. ఇప్పుడేమో చేతులెత్తేశాయి. దీంతో BCల నుంచి నిరసన వస్తుండడంతో పార్టీలకు దిక్కుతోచడం లేదు. ప్రచారాల్లో ఏం చెప్పాలోనని తల పట్టుకున్నాయి.

News February 3, 2026

అసభ్యంగా తాకాడు.. చెంపపై ఒక్కటిచ్చా: నటి రేవతి సెన్సేషనల్ కామెంట్స్

image

80వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రేవతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘11వ తరగతి చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఒక వ్యక్తి అసభ్యంగా తాకాడు. అస్సలు భయపడకుండా వెంటనే అతణ్ని అందరి ముందే చెంపపై కొట్టా. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా ఎదురుతిరగమని మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను అలా చేయించింది’ అని రేవతి పేర్కొన్నారు.

News February 3, 2026

VASTHU: చిన్న ఇల్లే చింతలేని ఇల్లు

image

పూర్వం ఉమ్మడి కుటుంబాలతో ఇళ్లు కళకళలాడేవి. కానీ నేడు పిల్లలు ఉద్యోగరీత్యా దూరమవ్వడంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ సులభంగా ఉండే చిన్న ఇల్లే స్వర్గమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరిస్తున్నారు. ‘ఓ పడకగది, వంటగది, హాల్‌తో కూడిన చిన్న ఇల్లు ఒంటరిగా ఉండేవారికి సౌకర్యంగా ఉంటుంది. ఆ ఇల్లు వాస్తు ప్రకారం తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>