News January 12, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు కోల్పోయి 83,135 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు నష్టపోయి 25,555 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, రిలయన్స్, బెల్, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Similar News
News January 30, 2026
భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.
News January 30, 2026
మామునూరు విమానాశ్రయం.. కేంద్రానికి 300 ఎకరాలు అప్పగింత

TG: WGL మామునూరు విమానాశ్రయం కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి Dy.CM భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి 2.5ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
News January 30, 2026
వరాహ స్వామి, వారాహి దేవి.. ఇద్దరూ ఒకరేనా?

ఇద్దరూ ఒకరు కాదు. కానీ ఒకే తత్వానికి చెందినవారు. వరాహ స్వామి దశావతార రూపం. వారాహి దేవి మాత్రం వరాహమూర్తి నుంచి ఉద్భవించిన ఆయన అంశ. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి, వరాహ స్వామి ముఖాన్ని పోలి ఉండి, రాక్షస సంహారంలో శక్తిగా తోడ్పడింది. వరాహ స్వామి రక్షకుడు అయితే, వారాహి దేవి ఆ స్వామి కార్యనిర్వాహక శక్తి. అయితే వరాహ అవతారానికి పూర్వమే, వారాహి దేవి ఉనికి ఉందని ఇంకొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.


