News September 10, 2024

నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.

Similar News

News February 25, 2026

శ్రీకాకుళం: రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు అవుట్..!

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పాలనా యంత్రాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లపై వేటు పడింది. ఒకరు బదిలీ కాగా.. మరొకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన దుర్గా ప్రసాద్ రెండు వారాల కిందట ఆకస్మికంగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ కూర్మారావు వచ్చి 2 వారాలు గడవక ముందే డయేరియా నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.

News February 25, 2026

శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్య

image

శ్రీకాకుళంలోని వాంబే కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ వివరాల ప్రకారం.. యడగళ్ల పవన్ కుమార్ (27) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. బుధవారం ఉదయం నివాసం సమీపంలోని ఇదే సముదాయంలోని 17వ నంబరు బ్లాక్‌లో ఖాళీగా ఉన్న ఇంటిలో ఉరి వేసుకొని ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 25, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్‌ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.