News January 31, 2025
నసురుల్లాబాద్: సాయిబాబా ఆలయంలో అమెరికా బృందం

నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలోని సాయిబాబా మందిరాన్ని శుక్రవారం అమెరికా బృందం సభ్యులు సందర్శించారు. ఆలయంలో తిరిగి పరిశీలించారు. ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలను పూజారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, విట్టల్ రెడ్డి, DSR రాజు, అనుపాల్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 19, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే లేరు: కేటీఆర్

TG: వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ BRS కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి గానీ, ముస్లిం ఎమ్మెల్యే గానీ, ముస్లిం ఎమ్మెల్సీ గానీ లేరని వ్యాఖ్యానించారు.
News September 19, 2025
‘విజయ’ సీటు కోసం వార్..!

నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. 14 ఏళ్లుగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న రంగారెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కీలకమైన ఈ పోస్టు కోసం సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు పోటీపడుతున్నారు. మొదట సర్వేపల్లికి చెందిన బాబిరెడ్డి పేరు దాదాపు ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ కోవూరు, ఆత్మకూరు నేతలు తీవ్రపోటీ ఇస్తున్నారు. ఫైనల్‌గా అదృష్టం ఎవరిని వరిస్తుందో..?
News September 19, 2025
ఈనెల 22న ‘కాంతార-1’ ట్రైలర్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార-1’ సినిమా ట్రైలర్ విడుదలపై అప్డేట్ వచ్చింది. ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.