News March 12, 2026

నస్పూర్: ‘ఆన్ లైన్‌లో సిలిండర్ బుక్ చేసుకోవాలి’

image

గ్యాస్ వినియోగదారులు ఆన్ లైన్‌లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఎల్పీజీ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు.

Similar News

News March 30, 2026

సాగులో భూసార పరీక్షలు కీలకం.. నిర్లక్ష్యం వద్దు

image

భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో తెలియక రైతులు అధికమొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. ఇది సాగుభూమికి శాపంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా భూసార పరీక్ష, నీటి పరీక్ష, అవసరమైతే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఏ పోషకాలున్నాయి, పంటలకు ఏ ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిస్తే భూమి సారవంతమవుతుంది.

News March 30, 2026

మట్టి నమూనాలు ఎక్కడ తీయకూడదు?

image

పొలంలో పోషకాల లోపాలను గుర్తించేందుకు మట్టి పరీక్షలు చేయించాలి. ఇందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కింద, గట్ల దగ్గర, నీటి కాల్వల పక్కన, భూమిలో తేమ ఉన్నా, పైరు ఉన్నా, ఎరువు కుప్పల వద్ద నమూనాలు తీయకూడదు. సాధారణ పంటకైతే అడుగు లోతులో, పండ్ల తోటలకైతే 4 అడుగుల లోతున మట్టి తీయాలి. పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం 8-10 మట్టి నమూనాలను తీసి పాలిథీన్ కవర్లలో ల్యాబ్‌కు పంపాలి.

News March 30, 2026

భూసార పరీక్షల వల్ల ప్రయోజనాలు

image

భూమి యొక్క భౌతిక, రసాయన స్థితిని తెలుసుకోవడానికి, ఏ పంటలు పండించడానికి అనువుగా ఉంటుందో తెలుసుకోవడానికి భూసార పరీక్షలు నిర్వహించడం మంచిది. ఈ పరీక్షలతో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి వాటితో పాటు అధిక దిగుబడికి వేయవలసిన ఎరువుల మోతాదు తెలుసుకోవచ్చు. పంటపొలాల్లో చౌడు, ఆమ్ల స్థాయిని నిర్ధారించి సరిచేసేందుకు సరైన పద్ధతులు సిఫారుసు చేయవచ్చు.