News September 23, 2025

నస్పూర్: జాతీయ రహదారుల ఆర్బిట్రేషన్ కేసులపై సమీక్ష

image

మంచిర్యాల జిల్లాలో జాతీయ రహదారి 163జీ పరిధిలోని 3వ విడత ఆర్బిట్రేషన్ కోసం దాఖలు చేసిన 114 కేసులను పరిశీలిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారి 63కు సంబంధించి జిల్లాలోని 17 గ్రామాల్లో కోర్టు స్టే ఉన్న గ్రామాలను మినహాయించి మిగతా గ్రామాల్లో అవార్డు జారీ చేసినట్లు వివరించారు.

Similar News

News September 23, 2025

VJA: దుర్గమ్మ ప్రసాదం .. నేతి లడ్డూ తయారీ ఇలా.!

image

విజయవాడ దుర్గమ్మ నేతి లడ్డూ అంటే భక్తులకు అత్యంత ఇష్టం. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో 36 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు భవనంలో లడ్డూ తయారీని ఆరంభించారు. ఈసారి విశాలమైన నూతన భవనం ఆరంభించారు. ఎంతో శుభ్రత పాటిస్తూ.. స్వచ్ఛమైన.. రుచికరమైన ప్రసాదం తయారు చేస్తున్నారు.

News September 23, 2025

BREAKING..NZB: గోడ కూలి తండ్రీకూతురి దుర్మరణం

image

కోటగిరిలో రైస్ మిల్లు గోడ కూలి తండ్రీకూతురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. మాలవాడకు చెందిన మహేశ్(25), అతని భార్య మహేశ్వరి, రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్‌మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించి మహేశ్వరిని ఆసుపత్రికి తరలించారు.

News September 23, 2025

ఈనెల 26 వరకు వర్షాలే వర్షాలు!

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా క్లౌడ్ బరస్ట్ తరహాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో వీడే అవకాశం లేదని APSDMA తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో మరో 3(26 వరకు) రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.