News September 22, 2024

నస్రుల్లాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. అంకోల్ గ్రామానికి చెందిన కుర్మరామ్‌గోండ(40) శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

Similar News

News February 28, 2026

NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

image

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.