News April 4, 2025
నస్రుల్లాబాద్: చెరువులో మునిగి యువకుడి మృతి

కొల్లూర్ గ్రామానికి చెందిన అశోక్(19) అనే యువకుడు చేపలు పట్టేందుకు నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని దొంతిరెడ్డి చెరువుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహం గురువారం నీటిపై తేలడంతో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవ పంచానామా నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News April 4, 2025
బ్లడ్‌బాత్.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.
News April 4, 2025
సిరిసిల్ల: అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయాలి: అదనపు కలెక్టర్

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రేషన్ కార్డుల జారీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలన, మీ సేవా, ఇతర మార్గాల ద్వారా రేషన్ కార్డుల జారీ కోసం వచ్చిన 30,977 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News April 4, 2025
నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలి- జేసీ

బాపట్ల జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా ఆరోగ్యానికి హానికరం అన్నారు.