News March 5, 2026
నస్రుల్లాబాద్: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన చిన్న మొగులయ్య ఈ నెల 4న రాత్రి ఇంట్లో రొట్టె ముక్కలు తిని, గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బయటకు వచ్చి రోడ్డుపై పడి మృతి చెందాడు. రొట్టె ముక్క వలన..? ఇతర కారణాల అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశామని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
MBNR: ఫైనల్ ఇయర్ పరీక్ష రద్దు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.
News April 17, 2026
19న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు

ఈనెల 19న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు సూర్యాపేటలోని లేడీ డీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుండూరి కృపాల్, ఎల్. సతీష్ కుమార్ తెలిపారు. అండర్-7, 11, 19 విభాగాలలో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు.
News April 17, 2026
ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


